భారతదేశం, ఏప్రిల్ 25 -- Inter Student Suicide: చదువే జీవితంకాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఆత్మ న్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం.

పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమరపాటు కారణంగా రెప్ప పాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

ఖమ్మం Khammam జిల్లా ముదిగొండ Mudigonda మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ Inter First year మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ళ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మంలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఆ విద్యార్థిని బుధవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో అనుత్తీర్ణత ...