భారతదేశం, జనవరి 29 -- Insurance Murder: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అప్పుల పాలైన యువకుడు చెల్లెలు పేరిట ఉన్న బీమా డబ్బులపై కన్నేశాడు. పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత హత్య వ్యవహారం వెలుగు చూడకుండా పోస్టుమార్టం నివేదికను కూడా మార్చేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో హత్య వెలుగు చూసింది. దాదాపు ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు.

డబ్బు కోసం సొంత చెల్లెలికి మత్తు మందు ఇచ్చి, దిండుతో నొక్కి హత్య చేసి ఆ తర్వాత కారు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. పోస్టుమార్టంలో హత్య వ్యవహారం దొరకకుండా ఆస్పత్రి సిబ్బందికి లంచం కూడా ఇచ్చాడు. చివరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో నిందితుడి ఆట కట్టించారు.

సరిగ్గా ఏడాది క్రితం ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. పోల...