భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఊహించని సంఘటనలు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తాయి. ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య బీమా, ప్రమాద బీమా చాలా ముఖ్యమైనవి. ఊహించని ఘటనతో కుటుంబ పెద్ద మరణిస్తే.. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాద బీమా బాగా ఉపయోగపడుతుంది. అతి తక్కువ ఖర్చుతో పోస్టల్ శాక ప్రమాద బీమా అందిస్తుంది. చాలా తక్కువ ప్రీమియంతో బీమా కవరేజీని అందిస్తుంది. ప్రైవేట్ బీమా కంపెనీల భాగస్వామ్యంతో బీమా సౌకర్యాలు ఉన్నాయి.

పోస్ట్ ఆఫీస్ అందించే ప్రమాద బీమా పథకాలలో రూ.520 బీమా స్కీమ్ ఒకటి. ఒకేసారి రూ.10 లక్షల బీమా కవరేజ్ పొందవచ్చు. టాటా ఏఐజీ సహకారంతో తపాలా శాఖ ఈ బీమాను అందిస్తోంది. సంవత్సరానికి రూ.520 చెల్లిస్తే సరిపోతుంది. పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు వస్తాయి. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ....