Hyderabad, మార్చి 30 -- Instagram Reels To Heroines: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వాడని హీరోయిన్స్, సెలబ్రిటీలు ఉండట్లేదు. తమకు సంబంధించిన సినిమా అప్డేట్స్‌ను అందులోనే షేర్ చేసుకుంటున్నారు. అయితే, ఇదే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా మారారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో లుక్కేద్దాం.

రీసెంట్‌గా నేచురల్ స్టార్ నాని సమర్పించిన కోర్ట్ మూవీ సూపర్ హిట్ అందుకుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీలో రోషన్, శ్రీదేవి ఇద్దరు ప్రేమికుల్లా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే, ఇందులో శ్రీదేవిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చూసి హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని...