భారతదేశం, మార్చి 14 -- Inspector Rishi Web Series: హీరోగా, విల‌న్‌గానే కాకుండా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు న‌వీన్ చంద్ర‌. తెలుగులో బిజీగా ఉన్న న‌వీన్ చంద్ర త‌మిళంలో చ‌క్క‌టి అవ‌కాశాల‌ను అందుకుంటున్నాడు. తాజాగా ఓ వెబ్‌సిరీస్‌తో ఈ నెలాఖ‌రున త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు న‌వీన్ చంద్ర‌.

న‌వీన్ చంద్ర లీడ్ రోల్‌లో క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఇన్‌స్పెక్ట‌ర్ రిషి పేరుతో త‌మిళంలో ఓ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. ఈ వెబ్‌సిరీస్‌కు సుఖ్‌దేవ్ ల‌హిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నందిని క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

గురువారం ఇన్‌స్పెక్ట‌ర్ రిషి స్ట్రీమింగ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించింది. ఫ‌స్ట్...