భారతదేశం, మార్చి 13 -- ఒకప్పటి బాలీవుడ్ అందాల తార భాగ్యశ్రీకి తీవ్ర గాయమైంది. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ఆమె నటించింది. పికిల్ బాల్ ఆడుతుండగా భాగ్యశ్రీకి ఇంజూరీ అయింది. నుదురుపై గాయంతో తీవ్రంగా రక్తం కారింది. ఈ ఇంజూరీకి శస్త్రచికిత్స చేశారు. ఆమె ఫోర్ హెడ్ పై 13 కుట్లు వేశారు.

పికిల్ బాల్ ఆడుతుంటే భాగ్యశ్రీకి ఇంజురైంది. గాయమైన విషయాన్ని 54 ఏళ్ల భాగ్యశ్రీ సోషల్ మీడియాలో వెల్లడించింది. హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆమె ఫోటో వైరల్ గా మారింది. తలపై బ్యాండేజీతో ఆమె కనిపించింది. ఆమె త్వరగా రికవరీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆమె పోస్టుకు కామెంట్లు పెడుతున్నారు.

భాగ్యశ్రీ డెబ్యూ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1989లో వచ్చిన హిందీ మూవీ 'మైనే ప్యార్ కియా'తో ఆమె సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. ఆ మూవీలో సల్మాన్ ఖాన...