భారతదేశం, సెప్టెంబర్ 12 -- భారతదేశపు రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్.. సంస్థ చరిత్రలోనే అతిపెద్ద షేర్ల బైబ్యాక్ (Infosys Share Buyback) కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ షేర్​ బైబ్యాక్ కార్యక్రమం విలువ రూ. 18,000 కోట్లుగా ఉండనుంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురువారం జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

స్టాక్ ఎక్స్​ఛేంజ్‌లకు సమర్పించిన నివేదిక ప్రకారం.. ఇన్ఫోసిస్ తన 10 కోట్ల (10,00,00,000) పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 5 ఉండగా, ఒక్కో షేరుకు రూ. 1,800 చొప్పున నగదు రూపంలో చెల్లించి కొనుగోలు చేయనుంది. ఇది బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ)లో కంపెనీ లేటెస్ట్​ ట్రేడింగ్​ ప్రైజ్​తో పోలిస్తే సుమారు 19% ప్రీమియంతో కూడుకున్నది!

"ఈ బైబ్యాక్ కార్యక్రమం.. కంపెనీ మొత్తం చ...