భారతదేశం, ఫిబ్రవరి 26 -- Infosys salary hike: దేశంలో రెండో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయడం ప్రారంభించింది. ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 24 నుండి ఈ ప్రక్రియను ప్రారంభించింది. చాలా మంది ఉద్యోగులకు సగటున 5-8 శాతం వరకు జీతాల పెంపు ఉంటుంది. అసాధారణ పనితీరు కనబరిచిన వారికి 10-12 శాతం వేతనాలు పెరిగాయని నివేదిక తెలిపింది. బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగుల పనితీరును నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. అవి 1. అద్భుతమైన పనితీరు. 2. ప్రశంసనీయమైన పనితీరు. 3. అంచనాలను అందుకున్న పనితీరు. 4. మెరుగుదల అవసరమైన పనితీరు. బ్యాండ్ జేఎల్ 6, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి వేతనాల పెంపు అమల్లోకి వచ్చింది.

ఇన్ఫోసిస్ లో 3.23 లక్షల మంది ఉద్యోగులున్నారు. చివరిసారిగా 2023 నవంబర్ లో వేతన పె...