భారతదేశం, ఫిబ్రవరి 17 -- Indrakeeladri Shivaratri : దుర్గామ‌ల్లేశ్వర స్వామి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై మ‌హా శివ‌రాత్రి మ‌హోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవ‌రి 24 నుంచి ఫిబ్రవ‌రి 28 వ‌ర‌కు ఐదు రోజుల పాటు మ‌హా శివ‌రాత్రి మ‌హోత్సవాలు నిర్వహించేందుకు వైదిక క‌మిటీ నిర్ణయించింది.

ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఆది దంప‌తుల‌కు మంగ‌ళ స్నానాల‌తో ప్రారంభ‌మై, మండ‌పారాధ‌న‌లు, క‌ల్యాణోత్సవం, ర‌థోత్సవం, పూర్ణాహుతితో ముగుస్తాయి. మార్చి 1 నుంచి 3 వ‌ర‌కు మ‌ల్లేశ్వ‌ర స్వామి వారి ఆల‌యంలో ప‌వ‌ళింపు సేవ జ‌రుగుతుంది. మ‌హాశివ‌రాత్రి ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవ‌రి 24వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు గంగా పార్వతి (దుర్గ) స‌మేత మ‌ల్లేశ్వర స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు, మంగ‌ళ స్నానాలు, నూత‌న వ‌ధూవ‌రుల అలంక‌ర‌ణ జ‌రుగుతుంది.

సాయంత్రం ఉత్సవాల‌కు అంకురార్పణ, మండ‌పారాధ‌న‌, ...