భారతదేశం, ఏప్రిల్ 15 -- Indiramma Indlu Cheques : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తొలి అడుగు వేసింది. ఈ పథకం తొలిదశలో భాగంగా అత్యంత నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ షురూ చేశారు. మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల విలువైన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. మంగళవాం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. రంగారెడ్డి, స...