తెలంగాణ,సంగారెడ్డి, ఫిబ్రవరి 22 -- సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలోని న్యాక్((నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)) శిక్షణ కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సిమెంట్ ఇటుకల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రారంభించారు.

జిల్లాలోని అన్ని ప్రతి మండలానికి ఐదు మంది చొప్పున ఆసక్తి అనుభవం ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇటుకల తయారీ, ఇండ్ల నిర్మాణంపై శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. న్యాక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక్కో విడతలో 35 మందికి. ఆరు రోజుల శిక్షణ ఇవ్వన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ కోసం జిల్లావ్యాప్తంగా 118 మంది మహిళల ఎంపిక చేయడం జరిగిందని ప్రకటించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వీరికి కాంట్రాక్ట్ అవకాశం కల్పిస్తామని క...