భారతదేశం, ఫిబ్రవరి 15 -- Indiramma Illu Update : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ హౌసింగ్ శాఖలపై సమీక్షలో వెల్లడించారు.

ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్శించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మధ్యతరగతి ప్రజల కోసం ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేరిట ఇళ్లు కట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించింది. ప...