భారతదేశం, ఫిబ్రవరి 2 -- తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని, లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుందని ఆశించింది. కానీ.. ఆశించిన స్థాయిలో కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. పైగా తగ్గించారు. దీని ప్రభావం ఇందిరమ్మ ఇండ్ల పథకంపై పడనుంది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద.. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేటాయింపులు తగ్గాయి. దీని ప్రభావం తెలంగాణలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంపై పడనుంది.

2.తెలంగాణకు రావాల్సిన కేంద్ర వాటా నిధులు తగ్గనున్నాయి. పీఎంఏవైలో ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే.. రూ.1.50 లక్షలు, గ్రామాల్లో అయి...