భారతదేశం, మార్చి 7 -- వ‌చ్చేవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌ని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం నాడు పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మంత్రి మాట్లాడారు. 'పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయ్యింది. గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక ప‌రిస్ధితి అస్త‌వ్య‌స్ధంగా త‌యారైంది' అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.

'ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తెలంగాణ ప్ర‌జానీకానికి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేటవుతుంది. ఆనాటి ప్రభుత్వం ...