భారతదేశం, మార్చి 11 -- Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు. రానున్న మూడు, నాలుగేళ్లలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున నిర్మిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే తమపై విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.

రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదవాళ్ల సొంతింటి కలను నేరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పైలెట్...