భారతదేశం, ఫిబ్రవరి 7 -- తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద ఎంపికైన ఒక్కో లబ్ధిదారునికి.. ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ఇస్తారు. ఒక్కో విడతలో రూ. 6,000 చొప్పున ఇస్తారు. దీని కోసం 2023-24లో ఉపాధి హామీ పథకం కింద 20 రోజుల పని దినాలు పూర్తి చేసి ఉండాలి.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. గ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులకు డిమాండ్ పెరిగింది. దీంతో కొత్తగా జాబ్ కార్డులు జారీ చేయవద్దని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా చాలా జిల్లాల్లో కొత్త జాబ్...