భారతదేశం, ఏప్రిల్ 14 -- ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏప్రిల్ 15 నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ(IGI) విమానాశ్రయంలోని టెర్మినల్ 1, టెర్మినల్ 3 నుండి మాత్రమే నడుస్తాయి. నిర్వహణ పనుల కారణంగా టెర్మినల్ 2 వద్ద కార్యకలాపాలను నిలిపివేస్తారు. ఏప్రిల్ 15 నుండి టెర్మినల్ 2 విమానాలు.. టెర్మినల్ 1కి మారుతాయని ఇండిగో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ మార్పు అమలుతో ఇండిగో ఇప్పుడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1, టెర్మినల్ 3 నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు పనిచేస్తుంది. 'ఢిల్లీ టెర్మినల్ 2 నిర్వహణలో ఉంది. ఫలితంగా ఏప్రిల్ 15, 2025 నుండి అన్ని విమానాలు టెర్మినల్ 1కి వెళ్తాయి. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇలాగే ఉంటుంది.' అని ఇండిగో నోటీసులో పేర్కొంది. విమానాల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని కూడా పేర్కొంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ఒక...