భారతదేశం, ఫిబ్రవరి 7 -- అక్రమ వలసల కారణంగా అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 104 మంది భారతీయుల్లో గుజరాత్​కు చెందినవారు 33 మంది ఉన్నారు! ప్రభుత్వ వాహనాల్లో, పోలీసుల పర్యవేక్షణల్లో వీరిందరిని స్వస్తలాలకు తరలించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కఠిన చర్యల నేపథ్యంలో 104 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం అమృత్​సర్​లో ల్యాండ్​ అయిన విషయం తెలిసిందే. కాగా ఆ మరుసటి రోజే, మహిళలు, పిల్లలతో పాటు 33 మంది గుజరాతీ వలసదారులతో కూడిన విమానం అమృత్​సర్ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.

అమృత్​సర్ విమానాశ్రయంలో వెరిఫికేషన్, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్​కు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, ఈ 33 మంది గురువారం ఉదయం 6.10 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగారు. అనంతరం వారిని వార...