భారతదేశం, మార్చి 29 -- Indian students in the USA: క్యాంపస్ యాక్టివిజంలో చురుగ్గా పాల్గొంటున్న వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ ఇమెయిల్స్ పంపుతోంది. యూఎస్ వ్యతిరేక నిరసనల్లో చురుకుగా పాల్గొన్న వారి ఆన్ లైన్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తోంది. వారి వీసా వివరాలను సమీక్షిస్తోంది. "జాతి వ్యతిరేక" సోషల్ మీడియా పోస్టులను కేవలం షేర్ చేసిన, లైక్ చేసిన లేదా ఆ పోస్ట్ లపై కామెంట్స్ చేసిన విద్యార్థుల వివరాలను కూడా పరిశీలిస్తోంది. ఈ చర్య అమెరికాలోని విదేశీ విద్యార్థులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఉన్న పరిమితులపై, ఆన్లైన్ కార్యకలాపాల పర్యవసానాలపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.

సోషల్ మీడియాలో అమెరికా వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకున్న విద్యార్థులకు యూఎస్ విదేశాంగ శాఖ హెచ్చరిక ఈమెయిల్స్ పంపిస్తున్న విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్...