భారతదేశం, మార్చి 5 -- Indian stock market: మార్చి నెలలో బుధవారం తొలిసారి స్టాక్ మార్కెట్ సూచీలు ఆకు పచ్చ రంగులో మెరిశాయి. దాదాపు అన్ని సెక్టోరల్ సూచీలు లాభాలను గడించాయి. దాంతో, ఇక మార్కెట్ కు మంచి రోజులు వస్తున్నాయన్న ఆశాభావం ఇన్వెస్టర్ల లో ప్రారంభమైంది. కాగా, చారిత్రకంగా కూడా మార్చి నెలలో మార్కెట్ తిరిగి పుంజుకున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి.

నిఫ్టీ 50 గత 10 ట్రేడింగ్ సెషన్లను ఎరుపు రంగులో ముగించింది. వరుసగా 10 సెషన్లలో నష్టాలు ఎదురుకావడం 1996 తరువాత ఇప్పుడే జరిగింది. ఈ 10 రోజుల్లో నిఫ్టీ విలువ 4% తగ్గింది. నిఫ్టీ 50 చివరిసారిగా డిసెంబర్ 28, 1995 నుండి జనవరి 10, 1996 వరకు వరుసగా 10 సెషన్లలో క్షీణించింది. కాగా, నిఫ్టీ 50 గత ఐదు నెలలను కూడా ఎరుపు రంగులో ముగించింది. ఇది చాలా అరుదైన సంఘటన.

అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.3.32 లక్షల కోట్లు...