భారతదేశం, అక్టోబర్ 7 -- అమెరికాలో హైదరాబాద్​ విద్యార్థి పోలె చంద్రశేఖర్​ని కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఎల్​బీ నగర్​కి చెందిన 27ఏళ్ల చంద్రశేఖర్​.. టెక్సాస్​ డెంటన్​ ప్రాంతంలోని ఓ గ్యాస్​ స్టేషన్​లో పార్ట్​టైమ్​ జాబ్​ చేస్తుండగా, అతనిపై రిచర్డ్​ ఫ్లోరెజ్​ అనే 28ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. రిచర్డ్​ ఫ్లోరెజ్​ అనే వ్యక్తి రిచ్​లాండ్​ హిల్స్​కి చెందినవాడు. చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత, సుమారు ఒక మైలు దూరంలో ఉన్న మరొక వాహనంపై కూడా కాల్పులు జరిపాడు! అయితే అందులో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ తర్వాత, మెడోబ్రూక్ డ్రైవ్‌లోని సమీప నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, గేట్‌ను ఢీకొట్టి, అతను ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు....