భారతదేశం, ఏప్రిల్ 7 -- హిందీ సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ సీజన్ 15' విజేతగా నిలిచారు మానసి ఘోష్. ఫైనల్‍లో అద్భుత పర్ఫార్మెన్స్ చేసి ట్రోఫీ కైవసం చేసుకున్నారు. గ్రాండ్ ఫినాలేలో సుభ్రజీత్ చక్రవర్తి, స్నేహ శంకర్‌ను ఓడించి విన్నర్ అయ్యారు మానసి. టైటిల్ ఫేవరెట్ అనుకున్న తెలుగు సింగర్ అనురుధ్ సుస్వరం టాప్-3 కూడా చేరలేకపోయారు.

ఇండియన్ ఐడల్ సీజన్ 15 విజేతగా నిలిచిన మానసి రూ.25లక్షల ప్రైజ్‍మనీ అందుకున్నారు. ఓ కొత్త కారు కూడా ఆమెకు దక్కింది. రన్నరప్‍గా సుభ్రజీత్ చక్రవర్తి నిలువగా.. మూడో స్థానం దక్కించుకున్నారు స్నేహ శంకర్. వారిద్దరికి చెరో రూ.5లక్షలు ప్రైజ్‍మనీగా దక్కింది.

తెలుగు సింగర్ అనిరుధ్ సుస్వరం.. ఇండియన్ ఐడల్ సీజన్ 15లో కొన్ని సూపర్ పర్ఫార్మెన్సులు చేశారు. తన గాత్రంతో అదరగొట్టారు. జడ్జిలు శ్రీయా ఘోషల్, విశాల్ దద్లానీ, బాద్‍షా చాలాసా...