భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించే అవకాశాన్ని లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వదులుకోలేదు. బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ స్టూడియో నుంచి ధోని మ్యాచ్ చూశాడు. ఐపీఎల్ 2025 షూటింగ్ లో ధోని బహుషా ఉన్నాడేమో అందుకే ఎల్లో జెర్సీ వేసుకుని కనిపించాడు. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో కలిపి మ్యాచ్ చూస్తున్న ధోని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్, పాక్ మ్యాచ్ ను సన్నీ డియోల్ తో కలిసి ధోని వీక్షించడాన్ని స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలో పాక్ ను భారత్ చిత్తు చేయడం మాజీ కెప్టెన్ ధోని చూస్తున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

ఈ మెగా మ్యాచ్ కు ముందు డియోల్ ఒక టీజర్ వీడియోలో తాను ఒక...