భారతదేశం, ఫిబ్రవరి 9 -- టీ20 ప్రపంచ కప్​ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్​ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్​.. ఇప్పుడు యూ-టర్న్​ కొట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పీసీబీ (పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు) ఐసీసీ మధ్య ఆదివారం జరిగిన కీలక సమావేశం అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి!. పలు మీడియా కథనాల ప్రకారం.. ఇండియాతో మ్యాచ్​ని బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్​ని ఐసీసీ హెచ్చరించింది. ఇండియాతో టీ20 మ్యాచ్​ని కొనసాగిస్తేనే మంచిదని ఈ భేటీ అనంతరం అనేక మంది పీసీబీ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.

ఇదే విషయంపై పీసీబీ సభ్యులు పాక్​ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ని మరోసారి సంప్రదించి, తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఆదివారం ఉదయం పీసీబీ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్...