భారతదేశం, ఫిబ్రవరి 17 -- భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంటుంది. ఈ హైవోల్టేజ్ సమరం కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈనెల ఫిబ్రవరి 23వ తేదీన భారత్, పాక్ తలపడనున్నాయి. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరనుంది. ఈ మ్యాచ్‍పై హైప్ విపరీతంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల ధరలు.. బ్లాక్‍మార్కెట్లో చుక్కలను చేరాయి.

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు దుబాయి బ్లాక్ మార్కెట్ వెబ్‍సైట్లలో లిస్ట్ అయ్యాయి. ఈ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉండటంతో బ్లాక్ మార్కెటర్స్ భారీగా ధరలు పెట్టేశారు. అఫీషియల్‍గా టికెట్లు దొరకని అభిమానులు బ్లాక్ మార్కెట్ రూపంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

దుబాయ్ స్టేడియంలో జరిగే భారత్, పాక్ మ్యాచ్‍ కోసం గ్రాడ్ లాంజ్ టికెట్లు సుమారు ఒక్కోటి రూ.4లక్షలకు బ్లాక్ మార్కెట్ ...