Hyderabad, మే 15 -- India Biggest Overseas Hit Caravan: ఇటీవల కాలంలో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. వాటిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జైరా వాసిం నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ నుంచి ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్, రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, ప్రభాస్ సలార్ వరకు ఎన్నో ఉన్నాయి.

ఈ సినిమాలన్నీ అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టాయి. కానీ, వీటన్నిటకింటే మించి అతిపెద్ద ఫీట్ సాధించిన సినిమా ఒకటి ఉంది. 1971లో వచ్చిన ఈ సినిమా అపూర్వమైన రికార్డును అందుకుంది. ఈ సినిమాకు ఇటీవలి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన RRR, పఠాన్, దంగల్, త్రీ ఇడియట్స్, సలార్ వంటి చిత్రాలు కూడా రికార్డ్ దగ్గరిగా లేకపోవడం విశేషం.

ఆ సినిమా పేరే కారవాన్. హిందీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ...