భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇది కదా గెలుపు అంటే.. ఇలా కదా పాకిస్థాన్ ను చిత్తు చేయాల్సింది. అవును.. ఇండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. బౌలింగ్ లో సత్తాచాటి పాక్ నడ్డివిరిచింది. ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో భారత్ 61 పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 రన్స్ చేసింది. ఛేజింగ్ లో పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ బౌలర్లలో బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య రెండేసి వికెట్లు తీశారు.

టీ20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయాలతో ఇండియా సూపర్ 8కు అర్హత సాధించింది.

టీమిండియా మెయిన్ పేసర్ బుమ్రా కొద్దికాలంగా ఫామ్ లో లేడు. కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ అనగానే బుమ్రా రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో సయీమ్ అయూబ్ (6), సల్మాన్ అఘా (4)ను...