భారతదేశం, మార్చి 2 -- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్ సూపర్ ఫామ్‍లో ఉంది. గ్రూప్ దశలో రెండు మ్యాచ్‍లు గెలిచి ఇప్పటికే సెమీఫైనల్ దూసుకెళ్లింది. నేడు (మార్చి 2) న్యూజిలాండ్‍తో చివరి గ్రూప్-ఏ మ్యాచ్ ఆడనుంది భారత్. కివీస్ కూడా ఇప్పటికే సెమీస్‍కు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ గ్రూప్-ఏ చివరి మ్యాచ్‍తో సెమీఫైనల్‍లో ప్రత్యర్థులు ఎవరో తేలనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ చివరి మ్యాచ్‍లో.. గెలిచిన జట్టు సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియాతో.. ఓడిన టీమ్ దక్షిణాఫ్రికాతో తలపడనున్నాయి. అంటే న్యూజిలాండ్‍తో ఈ మ్యాచ్‍లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్‍లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడితే సెమీస్‍ను దక్షిణాఫ్రితాతో ఆడాల్సి ఉంటుంది.

గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా...