భారతదేశం, ఫిబ్రవరి 19 -- No Income tax: మీరు రూ .12 లక్షల బ్రాకెట్ లో ఉన్నారు. త్వరలో మీ వేతనం మరింత పెరగనుంది. అయితే, శాలరీ పెంపుతో మీరు జీరో ట్యాక్స్ స్టేటస్ నుంచి పన్ను చెల్లించాల్సిన కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ మీ వార్షిక వేతనం రూ .14.65 లక్షల వరకు ఉన్నాకూడా.. కొత్త పన్ను విధానంలో, మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేయవచ్చు.అందుకు మీరు మీ మినహాయింపులను వ్యూహాత్మకంగా ఉపయోగించాలి.

రూ.14.65 లక్షల కాస్ట్ టు కంపెనీ (సీటీసీ) కలిగిన వేతన ఉద్యోగులు కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీరో ట్యాక్స్ ఎలా చెల్లించవచ్చో ట్యాక్స్2విన్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అభిషేక్ సోనీ వివరించారు. అదెలాగో చూడండి..

వార్షిక ఆదాయం (సిటిసి): 14,65,000

మూల వేతనం (సిటిసిలో 50 శాతం): 7,32,500

ఎన్పీఎస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ (బేసిక్ లో 14 శాతం): 1,02,5...