భారతదేశం, ఏప్రిల్ 15 -- ఈ కాలంలో మనల్ని ఎవరూ గమనించడం లేదూ అనుకోవడం చాలా తప్పు. డబ్బు లావాదేవీలు చేసినా పెద్దగా పట్టించుకోరు అనుకోవద్దు. కచ్చితంగా ఐటీ శాఖ కన్ను ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తోంది. మీ ఖర్చు, ఆదాయానికి మధ్య అంతరాన్ని గుర్తించడానికి డేటా విశ్లేషణ, ఏఐని వాడుతుంది. మీ ఆదాయానికి ఖర్చులకు మధ్య వ్యత్యాసం ఉంటే నోటీసు పంపి దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడానికి కారణాలను తెలుసుకుందాం..

ప్రతి నెలా రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే అది కూడా పన్ను శాఖ రికార్డులలోకి వెళ్తుంది. దీని వలన మీకు నేరుగా ఐటీ నోటీసు రావచ్చు. మీకు ఈ నగదు అంతా ఎక్కడి నుండి వస్తుంది? అని అడుగుతారు. ఈ లావాదేవీలను డిజిటల్‌గా చేయడం మంచిది.

ఎక్కువ విలువైన ఆస్తిని కొన...