భారతదేశం, ఫిబ్రవరి 5 -- Income Tax Limit: బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనిచ్చేలా రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు వల్ల ఏర్పడే లక్ష కోట్ల నష్టాన్ని ఎలా పూరిస్తారో కేంద్రం ప్రకటించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాల కొనసాగింపుగానే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కేవల కిషన్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బడ్జెట్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట వేశారని ఆన్నారు. క్రోని క్యాపిటలిజం కొద్దిమంది సంపన్నులే శతకోటీశ్వర్లు అవుతున్నారని పేర్కోన్నారు. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు లేవన్నారు.

మధ్యతరగతి కుటుంబాలకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినాయింపు ఇవ్వడం వల...