భారతదేశం, ఏప్రిల్ 5 -- Income Tax Inspector : హైదరాబాద్ లో ఆదాయపుపన్ను శాఖ ఇన్‌స్పెక్టర్‌ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. కవాడిగూడ సీజీవో టవర్స్‌ లోని 8వ అంతస్తు నుంచి దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. సీజీవో టవర్స్ సెక్యూరిటీ సిబ్బంది గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీమ్‌ ద్వారా వివరాలు సేకరించారు. జయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కవాడిగూడ సీజీవో టవర్స్‌లో శనివారం ఉద‌యం 11:15 సమయంలో ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. జయలక్ష్మి(52) సీజీవో టవర్స్‌పై నుంచి దూకడంతో ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ...