Hyderabad, మార్చి 27 -- విటమిన్ బి12 మన శరీరానికి అత్యవసరమైన పోషకం. దీన్ని కోబాలమిన్ అని పిలుస్తారు. విటమిన్ బి12 లోపిస్తే శరీరంలో ఎన్నో రోగాలు, ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సరిపడినంత విటమిన్ బి12 అందకపోతే నాడీ వ్యవస్థ ఆరోగ్యం నీరసపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. డిఎన్ఎ సంశ్లేషణ సరిగా జరగదు.

విటమిన్ బి12 ప్రధానంగా మాంసం, చేపలు, పాలు, పెరగు, గుడ్లు వంటి జంతు ఆధారిత ఆహారాలలో కనిపిస్తాయి. తక్కువ బి 12 స్థాయిలు అలసట, నరాల నష్టం, అభిజ్ఞా సమస్యలు, రక్తహీనతకు దారితీస్తాయి. కాబట్టి ఈ పోషకం శక్తిని అందించి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బి12 లోపిస్తే తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతోంది. కాబట్టి విటమిన్ బి12 ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎర్ర రక్త కణాల నిర్మాణం: ఆరోగ్యకరమైన ఎర్ర...