Hyderabad, మార్చి 30 -- పిల్లలలో ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి వారిని రక్షిస్తుంది. వారిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. పిల్లల శరీరంలో ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే సరైన పోషకాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు మైరుగైన నిద్ర చాలా అవసరం. నిజానికి పిల్లల్లో ఇమ్యూటినీ చాలా అవసరం ఎందుకంటే.. పాఠశాలలు, ఆట సమయంలో వారు ఎక్కువ బ్యాక్టీరియా, వైరస్ లకు గురవుతారు. ఇలాంటప్పుడు వారిలో త్వరగా దగ్గు, జలుబు, ఫ్లూతో పాటు చర్మ రుగ్మతలు వంటి సమస్యలు సులువగా వస్తాయి. నీరసం, అలసట వంటివి తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆకలి తగ్గిపోతుంది.

రోగనిరోధక శక్తి బలంగా ఉంటే పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండటం మాత్రమే కాకుండా మెదడు అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది.రోగనిరోధక శక్తి బలంగా ఉండే ప...