భారతదేశం, ఆగస్టు 30 -- రుతుపవనాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ తరుణంలో తూర్పు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, నైరుతి మధ్యప్రదేశ్, గుజరాత్, తూర్పు అసోం, మేఘాలయ, మిజోరాం, ఉత్తర కోస్తా ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ).

అంతేకాకుండా, తూర్పు జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, ఉత్తర బిహార్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, గంగా పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

గత 24 గంటల్లో జమ్ములోని ఉధంపూర్‌లో 85 ఎంఎం వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్, గుజరాత్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ ...