భారతదేశం, ఏప్రిల్ 5 -- దేశంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు వేసవిలోనూ దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుంటే, మరోవైపు ఉత్తర భారతంలో మాత్రం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుతో పాటు దక్షిణాది అనేక ప్రాంతాలకు వర్ష సూచన ఇచ్చిన భారత వాతావరణశాఖ, దిల్లీకి మాత్రం హీట్​వేవ్​ అలర్ట్​ని జారీ చేసింది. పూర్తి వివరాలు..

తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెన్నైలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కేంద్రం శనివారం హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, నాగపట్నం జిల్లాలు, కరైకల్ ప్రాంతంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవ...