Hyderabad, జనవరి 27 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఊరిలో సంక్రాంతి పోటీలు జరుగుతాయి. భార్యలను ఎత్తుకుని అందరికంటే ముందుగా పరిగెత్తాలి. జెనరల్‌గా దెయ్యాలు క్షణాక్షణానికి బరువు పెరుగుతాయంటా. నువ్వే కూడా అలాగే పెరుగుతున్నావ్. నువ్ కూడా ఆ సామాజిక వర్గానికే చెందినదానివేగా అని ధీరజ్ దాంతో ప్రేమ ధీరజ్‌ను కొడుతుంది, గిచ్చుతుంది.

నీ మీద ఎక్కినందుకు నాకు కూడా కంపరంగా ఉందిరా అని ప్రేమ అంటుంది. తర్వాత ఆ పరుగుపందెంలో ధీరజ్, ప్రేమ గెలుస్తారు. ఆ తర్వాత సాగర్, నర్మద వస్తారు. దాంతో అంతా చప్పట్లు కొడుతారు. మా ఇద్దరు కోడళ్లు గెలిపించారు అని వేదవతి అంటుంది. అది చూసి భద్రావతి కోపంతో రగిలిపోతుంది. తర్వాత ప్రేమను గిచ్చి తన రివేంజ్ తీర్చుకుంటాడు ధీరజ్. దాంతో ఒక్కసారిగా అరుస్తుంది ప్రేమ. దున్నపోతులా ...