భారతదేశం, జనవరి 29 -- ప్ర‌భ‌ల పోటీలు మొద‌ల‌వుతాయి. రామ‌రాజు, సేనాప‌తి కుటుంబాలు మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ప్ర‌భ‌ల పోటీల్లోనే ధీర‌జ్‌ను చంపాల‌ని విశ్వ మ‌నుషులు ప్లాన్ చేస్తారు. ధీర‌జ్‌ను సీక్రెట్‌గా రౌడీ ఫాలో అవుతాడు. ప్ర‌భ‌ల ర‌థాన్ని ప‌ట్టుకున్న ధీర‌జ్‌ను పొడ‌వ‌బోతాడు. కానీ అప్పుడే రాయి త‌ట్టుకొని రౌడీ కింద‌ప‌డ‌టంతో ధీర‌జ్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తాడు. మంచి ఛాన్స్ మిస్ చేయ‌డంతో రౌడీపై విశ్వ ఫైర్ అవుతాడు.

ప్ర‌భ‌ల పోటీల్లో సేనాప‌తి, రామ‌రాజు ముందు ఉండ‌టంతో భ‌ద్రావ‌తి ఆనంద‌ప‌డుతుంది. కానీ చివ‌రి నిమిషంలో వారిని దాటేసి రామ‌రాజు కుటుంబం పోటీల్లో గెలుస్తుంది. పోటీలో గెలిచిన అనందంతో రామ‌రాజు ఫ్యామిలీ గంతులేయ‌డం చూసి సేనాప‌తి, విశ్వ కోపం ప‌ట్ట‌లేక‌పోతారు. ధీర‌జ్ చావును, శ‌వాన్ని క‌ళ్లారా చూడాల‌ని అనుకున్నాన‌ని, కానీ మాపై వాడి గెలుపును చూ...