భారతదేశం, ఫిబ్రవరి 14 -- Illu Illalu Pillalu Today Episode: చందు కోసం పెళ్లి సంబంధం చూస్తుంది న‌ర్మ‌ద. పెళ్లి చూపుల కోసం రామ‌రాజు, వేదావ‌తితో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యులు వెళ‌తారు. ధీర‌జ్‌, ప్రేమ‌ను మాత్రం ఇంట్లోనే ఉండ‌మ‌ని చెబుతుంది వేదావ‌తి. ధీర‌జ్ కోసం వంట ప్రిపేర్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది ప్రేమ‌. ఏం తింటావ‌ని అడుగుతుంది.

ఆమె మాట‌ల‌తో షాక‌వుతాడు ధీర‌జ్‌. నువ్వు నా కోసం వంట చేస్తావా? ఈ రోజు ఖ‌చ్చితంగా భూకంపం వ‌స్తుంద‌ని ధీర‌జ్ ఆన్స‌ర్ ఇస్తాడు. నీది ఎగ‌బ‌డి తినే ఫేస్‌లా ఉంద‌ని, వండే ఫేస్‌లో క‌నిపించ‌డం లేద‌ని అనుమానంగా ప్రేమ‌ను అడుగుతాడు.

నీకు ఏది వ‌స్తే త‌గిలేయ్ చెప్ప‌డం ఎందుకు అని ధీర‌జ్ అంటాడు. నువ్వు చేసిన వంట తిన్న త‌ర్వాత న‌న్ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌డానికి ఆంబులెన్స్ రావాల్సివ‌స్తుందేమోన‌ని ధీర‌జ్ సెటైర్లు వేస్తాడు. నా చేతి ...