భారతదేశం, జనవరి 28 -- జాత‌ర‌లో త‌న ల‌వ‌ర్ క‌నిపించ‌డంతో చందు షాక‌వుతాడు. చందు ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని భ‌ర్త‌తో ఆమె చెప్ప‌డం చూసి బాధ‌ప‌డ‌తాడు. చందును ధీర‌జ్ ఓదార్చుతాడు. త‌ను దూర‌మై చాలా కాల‌మైనా ఇంకా ఏడుస్తున్నావంటే...నీ మ‌న‌సులో ఆమె ప‌ట్ల ఎంత ప్రేమ ఉందో అర్థ‌మ‌వుతుంద‌ని చందుతో ధీరజ్ అంటాడు.

ఆ అమ్మాయిని ప్రేమించాన‌ని ఒక్క మాట నాన్న‌తో చెప్పి ఉంటే నీ లైఫ్ ఇంకోలా ఉండేద‌ని, ఈ బాధ క‌న్నీళ్లు ఏవి ఉండేవి కావ‌ని చందుతో ధీర‌జ్ చెబుతాడు కానీ నాన్న అంటే నీకు ఉన్న గౌర‌వం, భ‌యంతో నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు...నిన్ను చూస్తుంటే బాధగా ఉందని చందుతో ధీరజ్ అంటాడు.

ప్ర‌భ‌లు తీసుకెళ్లడానికి అంద‌రూ సిద్ధం కావాల‌ని అనౌన్స్‌మెంట్ రావ‌డంతో చందును అక్క‌డి నుంచి పంపిస్తాడు ధీర‌జ్‌. తాను కోనేటి నుంచి తీర్థం తీసుకొస్తాన‌ని అన్న‌య్య‌కు చెబుతాడు. కోనేటి నీళ్లు త...