భారతదేశం, జనవరి 31 -- జాత‌ర‌లో రౌడీల‌కు దొరికిపోతాడు ధీర‌జ్‌. అత‌డిని విశ్వ చంప‌బోతుండ‌గా ప్రేమ కాపాడుతుంది. మ‌రోవైపు రాత్ర‌యినా ధీర‌జ్‌, ప్రేమ ఇంటికి రాక‌పోవ‌డం, ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో వేదావ‌తి కంగారుప‌డుతుంది. కొడుకు, కోడ‌లికి జ‌ర‌గ‌రానిది ఏద‌యినా జ‌రిగింద‌ని భ‌య‌ప‌డుతుంది.

ధీర‌జ్‌కు వ‌ల్ల నాకు బాధ‌లు, అవ‌మానాలు ఎదుర‌వ్వ‌డం త‌ప్ప వాడికి మాత్రం ఏం కాద‌ని రామ‌రాజు అంటాడు. గుడిలో త‌న‌కు అవ‌మానం జ‌ర‌గడానికి ధీర‌జ్ కార‌ణ‌మ‌ని నిందిస్తాడు. ప్రేమ‌ను ధీర‌జ్ పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్లే ఊరంద‌రి ముందు తాను ప‌రువు పోగొట్టుకొని గుడిలో హార‌తి ఇవ్వ‌కుండా రావాల్సివ‌చ్చింద‌ని కోప్ప‌డుతాడు. ఎదురింటితో మ‌న‌కు శ‌త్రుత్వం ఉంద‌ని తెలిసి, వాళ్లు తన‌ను అవ‌మానిస్తార‌ని తెలిసి కూడా ప్రేమ‌ను ధీర‌జ్ పెళ్లి చేసుకున్నాడ‌ని వేదావ‌తితో రామ‌రాజు అంటాడు.

ధీర‌జ్‌కు మీ...