భారతదేశం, జనవరి 30 -- ఊరి పెద్ద‌గా రామ‌రాజుకు అర్హ‌త లేద‌ని భ‌ద్రావ‌తి, సేనాప‌తి అవ‌మానిస్తారు. ఇంట్లోనే రామ‌రాజుకు విలువ లేద‌ని, తండ్రికి చెప్ప‌కుండా ఇద్ద‌రు కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నార‌ని భ‌ద్రావ‌తి త‌క్కువ చేసి మాట్లాడుతుంది. భ‌ర్త‌కు త‌న క‌ళ్ల ముందే అవ‌మానం జ‌ర‌గ‌డం వేదావ‌తి స‌హించ‌లేక‌పోతుంది.

త‌న భ‌ర్త గురించి మాట జారితే బాగుంద‌ని సేనాప‌తికి వార్నింగ్ ఇస్తుంది. ఎవ‌రిని బాధ‌పెట్ట‌కుండా గౌర‌వంగా బ‌తికే మ‌నిషిని అవ‌మానించ‌డానికి మీకు మ‌న‌సు ఎలా వ‌చ్చింద‌ని నిల‌దీస్తుంది.

ఆ రోజు నువ్వు ఎలా చేశావో...నీ కొడుకులు ఇప్పుడు అలాగే త‌యార‌య్యార‌ని, ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావ‌ని చెల్లెలిని కోపంగా క‌సురుకుంటాడు సేనాప‌తి. రామ‌రాజుకు త‌న‌ త‌ల్లిదండ్రులు ఎవ‌రు తెలియ‌దు. క‌నీసం ఇంటి పేరు కూడా లేని అనాథ‌. వీడి కుటుంబంలోని ఒక్క‌రు...