Hyderabad, ఫిబ్రవరి 8 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పెద్దోడి పెళ్లి చూపులకు వెళ్లొస్తాం అని వేదవతి, రామరాజు వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కోటి చెబుతారు. ఆడపడుచు కట్నం గురించి కామాక్షి అడిగితే.. నిన్ను ఆడపడుచు కట్నం సంఘానికి అధ్యక్షురాలిని చేయాలే అని అమూల్య అంటుంది. నాకు రావాల్సిన వాటా నేను అడుగుతున్నాను. నీకెంటటా అని కామాక్షి అంటుంది.

తర్వాత చందును పిలుస్తాడు రామరాజు. ఒక తండ్రిగా నేను నా కొడుకుల విషయంలో ఓడిపోయానా అని బాధపడుతున్న క్షణంలో నువ్వు గర్వంగా నన్ను తలెత్తుకునేలా చేశావురా. నీ విషయంలో నా తండ్రి బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను. ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి నువ్ జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తాను అని రామరాజు చెప్పి వెళ్తాడు. చందు నుదుటిపై ముద్దుపెట్టి వేదవతి కూడా బయలుదేరుతుంది...