భారతదేశం, ఫిబ్రవరి 7 -- Illu Illalu Pillalu: ధీర‌జ్ దెబ్బ‌ల‌తో కింద‌ప‌డుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అనుకుంటుంది ప్రేమ‌. భ‌ర్త‌ను బెడ్‌పై ప‌డుకోమ‌ని చెప్పి తాను కింద ప‌డుకోవ‌డానికి చాప ప‌రుచుకుంటుంది. నిన్ను అష్ట‌క‌ష్టాలు పెడుతున్నాన‌ని, నా వ‌ల్ల నువ్వు టార్చ‌ర్ అనుభ‌విస్తున్నావ‌ని అంద‌రిని న‌మ్మించ‌డానికే ఈ డ్రామాలు ఆడుతున్నావా అంటూ ప్రేమ‌ను అపార్థం చేసుకుంటాడు ధీర‌జ్‌.

నీ ముఖం చూస్తూ నేను ఇక్క‌డ ప‌డుకోలేన‌ని చెప్పి చాప తీసుకొని రూమ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతాడు ధీర‌జ్‌. పోనీలే దెబ్బ‌లు త‌గిలాయి క‌దా అని జాలి చూపిస్తే పొగ‌రు చూపిస్తున్నాడ‌ని ధీర‌జ్‌పై కోపంతో ర‌గిలిపోతుంది ప్రేమ‌.

ధీర‌జ్ చాప, దిండు తీసుకొని త‌మ ప‌క్క‌న ప‌డుకోవ‌డానికి రావ‌డం చూసి తిరుప‌తి షాక‌వుతాడు. ఇది బ్యాచ్‌ల‌ర్స్ అడ్డా అని, ఇక్క‌డికి పెళ్లైన వారికి నో ఎంట్రీ అంటూ ధీర‌జ్‌ను ప‌డు...