భారతదేశం, ఫిబ్రవరి 6 -- Illu Illalu Pillalu: రామ‌రాజుపై ప‌గ‌తో చందు ల‌వ్‌స్టోరీని బ‌య‌ట‌పెడుతుంది భ‌ద్రావ‌తి. వేదావ‌తితో పాటు ప్రేమ త‌మ ఇంటికి దూరం కావ‌డానికి, త‌న తండ్రి చావుకు రామ‌రాజు కార‌ణ‌మ‌ని భ‌ద్రావ‌తి ఆరోపిస్తుంది. మా ఇంటిని చీక‌టి చేసిన మీ ఇంట్లో వెలుగులు ఉండ‌నివ్వ‌ను. మాకు సంతోషాల్ని దూరం చేసి భ‌రించ‌లేని బాధ‌ల్ని మిగిల్చిన మిమ్మ‌ల్ని ఆనందంగా ఉండ‌నివ్వ‌న‌ని రామ‌రాజుతో భ‌ద్రావ‌తి స‌వాల్ చేస్తుంది. ఏ పిల్ల‌ల్ని చూసి పంచ ప్రాణాలు అని విర్ర‌వీగుతున్నావో...వారినే చూసి నువ్వు ప్ర‌తిక్ష‌ణం ఏడ్చేలా చేస్తాన‌ని రామ‌రాజుతో అంటుంది భ‌ద్రావ‌తి.

భ‌ద్రావ‌తి అన్న మాట‌ల్ని రామ‌రాజు త‌ట్టుకోలేక‌పోతాడు. చందు పిలిచినా ప‌ట్టించుకోకుండా రామ‌రాజు ప‌ట్టించుకోడు. బాధ‌తో అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. తండ్రికి నిజం తెలిసిపోయినందుకు చందు బాధ‌ప‌డ‌తాడు. రామ‌ర...