భారతదేశం, ఫిబ్రవరి 4 -- Illu Illalu Pillalu: చాలా రోజుల త‌ర్వాత అ స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ మాట‌ల్లో మునిగిపోతారు ధీర‌జ్‌, చందు, సాగ‌ర్‌. ముగ్గురు మేడ‌పైన నిద్ర‌పోవాల‌ని అనుకుంటారు. నిద్ర పోయే టైమ్ అయ్యింద‌ని, ఈ రోజు రూమ్‌లోకి వ‌చ్చేది ఉందా? లేదా? అని సాగ‌ర్‌ను అడుగుతుంది న‌ర్మ‌ద‌.

చాలా రోజుల త‌ర్వాత స‌ర‌దాగా మాట్లాడుకునే అవ‌కాశం దొరికింద‌ని, ఈ రోజు మేడ‌పైనే ప‌డుకుంటాన‌ని న‌ర్మ‌ద‌ను బ‌తిమిలాడుతాడు సాగ‌ర్‌. న‌ర్మ‌ద ఒప్పుకుంటుంది.

న‌ర్మ‌ద ఒప్పుకోక‌పోయి ఉంటే కాళ్లు ప‌ట్టుకునేలా ఉన్నావ‌ని సాగ‌ర్‌ను ఆట‌ప‌ట్టిస్తాడు తిరుప‌తి. పెళ్లికి ముందు పులిలా ఉండే మ‌గాడి జీవితం పెళ్లి త‌ర్వాత మాట‌లు రాని టెడ్డీ బేర్‌లా మారిపోతుంద‌ని సాగ‌ర్ అంటాడు.

మీది ల‌వ్ మ్యారేజ్ ..మీ ఇద్ద‌రి మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాడింగ్ ఉంది క‌దా...అలా మాట్లాడుతున్నావేంటి అని త‌మ...