Hyderabad, ఫిబ్రవరి 3 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ధీరజ్‌ను ఎప్పటికైనా చంపుతాను అని విశ్వ అంటాడు. వాన్ని చంపేసి నువ్ హంతకుడు అవుతావా. జైలుకు వెళ్తావా అని భద్రావతి అంటుంది. వెళ్తాను అని గట్టిగా అంటాడు విశ్వ. నా చెల్లెలి కోసం జైలుకైనా వెళ్తాను. మహా అయితే నాలుగేళ్లు జైల్లో ఉంటాను. నా చెల్లెలు అయితే ఇంటికి వస్తుందిగా అని విశ్వ అంటాడు.

అరేయ్ కన్న కొడుకు విషయంలో కూడా కడుపు కోత పెట్టకురా అని రేవతి అంటుంది. పాతికేళ్లుగా వీళ్లు పడుతున్న బాధను చూస్తున్నావ్‌గా. నువ్ కూడా ఇలాగే బాధపడతావా అని విశ్వ అంటాడు. అలాగని నీ చెల్లెలి పసుపుకుంకుమలు నీ చేత్తో అని రేవతి అంటే.. అదేమైనా మనం చేసిన పెళ్లా. లేచిపోయి చేసుకున్నారు. నా దృష్టిలో అది నా పెళ్లే కాదు. అందుకే ఆ ధీరజ్‌ గాడిని ఈ భూమ్మీద లేకుండా చ...