Hyderabad, ఫిబ్రవరి 1 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ధీరజ్‌ను ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని వేదవతి అడుగుతుంది. గొంతు చించుకుని అరుస్తుంటే ఎవరు మాట్లాడరేంటీ.. ఏమైందిరా చిన్నోడా. చెప్పు అని వేదవతి అడుగుతుంది. చిన్న గొడవ జరిగిందని ధీరజ్ అంటాడు. గొడవ.. నన్ను ఎవరు కొట్టారురా అని వేదవతి అడుగుతుంది.

అదేంట్రా యాక్సిడెంట్ అని చెప్పావ్. ఇప్పుడు గొడవ అంటున్నావ్ అని మామ అడుగుతాడు. అదే మామ బైక్ యాక్సిడెంట్ చేసినవాడితో గొడవ అని ధీరజ్ అబద్ధం చెబుతాడు. అక్క వీళ్లంతా ఏదో విషయం దాస్తున్నారు. ఏదో జరిగింది. ఏదో మతలబు ఉందని మామ అంటాడు. దాంతో ప్రేమను అడుగుతుంది వేదవతి. ఏం లేదమ్మా. కంగారుపడకు అని ధీరజ్ అంటే.. ప్రాణం పోతుందిరా నాకు అని వేదవతి ఏడుస్తూ అంటుంది.

మీరు నిజం దాస్తుంటే భయంగా ఉంది. ఆ భయం పెరిగ...