భారతదేశం, ఫిబ్రవరి 13 -- చందు గురించి, రామ‌రాజు, వేదావ‌తి మంచిత‌నం గురించి త‌న స్నేహితురాలు ప‌ద్మ‌కు గొప్ప‌గా చెబుతుంది న‌ర్మ‌ద‌. కోడ‌ళ్ల‌ను కూతుళ్ల‌లా చూసుకుంటార‌ని, చందు చాలా అమాయ‌కుడ‌ని, మంచివాడ‌ని చెబుతుంది. న‌ర్మ‌ద మాట‌ల‌పై న‌మ్మ‌కంతో చందుకు త‌మ పిన్ని కూతురితో సంబంధం ఖాయం చేస్తుంది ప‌ద్మ‌. పెళ్లి చూపుల‌కు ఏర్పాట్లు చేసుకోమ‌ని అంటుంది.

ప‌ద్మ మాట‌ల‌తో న‌ర్మ‌ద హ్యాపీగా ఫీల‌వుతుంది. ఈ గుడ్‌న్యూస్‌ను రామ‌రాజు, వేదావ‌తితో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యుల‌కు చెబుతుంది. రేపు పెళ్లి చూపుల‌కు వెళ‌దామ‌ని అంటుంది. గ‌త పెళ్లి చూపుల్లో జ‌రిగిన అవ‌మానం గుర్తొచ్చి రామ‌రాజు పెళ్లి చూపుల‌కు వెళ్ల‌డం వ‌ద్ద‌ని అంటాడు.

చందుకు తానే పెళ్లి సంబంధం చూస్తాన‌ని న‌ర్మ‌ద‌తో అంటాడు. పోయిన పెళ్లిచూపుల్లో ప‌డ్డ మాట‌లు త‌ల్చుకొనే మీరు ఇలా మాట్లాడుతున్నార‌ని అర్థ‌మైంద‌...