భారతదేశం, ఫిబ్రవరి 12 -- ధీర‌జ్‌, ప్రేమ ఒకే బైక్‌పై కాలేజీకి వెళ్లేలా న‌ర్మ‌ద‌నే ప్లాన్ చేస్తుంది. కోప‌తాపాలు పోయి ఇద్ద‌రు మ‌ధ్య ఈ విధంగానైనా చ‌నువు పెరుగుతుంద‌ని వేదావ‌తికి స‌ల‌హా ఇస్తుంది న‌ర్మ‌ద‌. కోడ‌లు ఇచ్చిన స‌ల‌హాకు వేదావ‌తి ఫిదా అవుతుంది. ప్రేమ‌ను కాలేజీకి బైక్ తీసుకువెళ్ల‌మ‌ని ధీర‌జ్‌కు చెబుతుంది వేదావ‌తి. అందుకు ధీర‌జ్ ఒప్పుకోడు. ప్రేమ కూడా ధీర‌జ్ బైక్‌పై వెళ్ల‌డానికి సందేహిస్తుంది. కానీ వేదావ‌తి మాట కాద‌న‌లేక ఇద్ద‌రు అయిష్టంగానే అంగీక‌రిస్తారు.

ధీర‌జ్‌, ప్రేమ ఒకే బైక్‌పై కాలేజీకి బ‌య‌లుదేరుతారు. ఇద్ద‌రు జంట‌గా మొద‌టిసారి కాలేజీకి వెళుతుండ‌టంతో దిష్టి తీస్తుంది వేదావ‌తి. ధీర‌జ్ బైక్‌పై ప్రేమ ఎక్క‌డం భ‌ద్రావ‌తి, సేనాప‌తి చూస్తారు. కోపంతో ర‌గిలిపోతారు.

తండ్రితో పాటు భ‌ద్రావ‌తిని చూడ‌గానే భ‌యంతో బైక్ దిగిపోతుంది ప్రేమ‌. వేదావ‌తి ...